Tuesday, 15 September 2020

Telugu Podupu kathalu Part 1 తెలుగు పొడుపు కథలు

  తెలుగు లో పొడుపు కథలు Part 1
 

అమ్మ తమ్ముడిని కాను, కానీ నేను నీకు మేనమామను
చందమామ

అరం కణం గదిలో అరవై మంది నివాసం
అగ్గిపెట్టె,  పుల్లలు

పోకంత పొట్టోడు, ఇంటికి గట్టోడు
తాళాం కప్ప

అరచేతి కింద అరిసె
పిడక

అమ్మంటే దగ్గరకు ... అయ్యంటే దూరంగా పోయేది ఏమిటి?
పెదాలు

అడవిలో అక్కమమ తల విరబోసుకుంది
ఈతచెట్టు

కారం కాని కారం
ఆకారం  / మమకారం /  ప్రతీకారం / వెటకారం

ఇదొస్తే ఎవరైనా నోరు తెరిచి దారి ఇవ్వాల్సిందే
ఆవలింత

దీని పళ్ళు ఊడితే మళ్ళీ రావు
దువ్వెన

కూత కూస్తే కాని పరుగు తీయదు
రైలు

మనిషి కాదు, జ్ఞానం లేదు, కాని తన వేయి కళ్ళతో మంచి చెడ్డలను వేరు చేస్తుంది, ఏంటది
జల్లెడ

మొండెం వుంటుంది, కాని తల, కాళ్ళు, చేతులు లేవు. ఏంటది
సీసా

అందర్నీ చూడగలదు, తనను తాను చూడలేదు?
కన్ను

ఆకలేయదు నీరు తాగదు. నేలని పాకదు. ఏమిటి ఆతీగ
కరెంట్ తీగ

ఆడవాళ్ళకుండనిది .. మగవాళ్ళకు ఉండేది?
మీసం

అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది
గొడ్డలి

ఆవీధిరాజుకి కొప్పుంది, జుట్టు లేదు. కళ్ళున్నాయి, చూపులేదు ..?
కొబ్బరికాయ

ఇటుకతో ఇల్లు కట్టి .. దంతాన తనుపుపెట్టె.. తానుబోయి సరసమాడెను
మొగలిపువ్వు

దీనికి రెండే కాల్లు, చేతులు మాత్రం ఏడు ..?
నిచ్చెన

మూలన కూర్చుంటుంది, ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలు దేరుతుంది
గొడుగు

Telugu Podupu Kathalu 1

 


No comments:

Post a Comment