Tuesday, 13 October 2020

Telugu Moral story 2 రాజ్యంలో ఇద్దరే మూర్కులు

 మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి"అని అడుగుతాడు....

గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి  ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు? 'అంటుంది....

కాళిదాసు "నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు" అని అంటాడు....

ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’ అంటుంది....

కాళిదాసు కాసేపు ఆలోచించి "నాకు తెలియదు. గొంతు ఎండి పోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి" అని బతిమాలుకుంటాడు..

"ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.
ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు....
అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....
తెల్ల ముఖం పెట్టి మాతా! "నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు....

వాళ్ళు సూర్యచంద్రులు’ అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి. నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....

కాళిదాసు దీనంగా "నేను అతిథిని" అని బదులిస్తాడు....
"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే ఒకటి ధనం, రెండోది యవ్వనం అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు" అంటుంది ముసలావిడ...

కాళిదాసు "నా సహన పరీక్ష  తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి" అని వేడుకుంటాడు....
"ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో "ఒకటి భూమి, రెండోది వృక్షం" అని భోద పరచి" ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?" అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....

ఓపిక నశించిన కాళిదాసు "నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి" అని సాగిల పడతాడు....
ఆ అవ్వ నవ్వుతూ" ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు" అని అంటుంది....

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....
ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.* ‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి, అహంకారం కాదు. కీర్తి, ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.

విద్య, అధికారం, ధనము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.

Moral Story in Telugu ఉపన్యాసాలు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు

ఒకఊరిలో అత్తాకోడల్లు మాట్లాడుకుంటుండగా మాటల్లో చిన్నకోడలు అన్ని దానాల్లోకెల్లా నీరు దానం చెయ్యడం చాలాగొప్ప,  నీళ్లిస్తే వచ్చేంత పుణ్యం- అన్నం పెట్టినందుకు లేదు. ఎందుకంటే అన్నం రోజుకు ఒకటి రెండు పర్యాయాలే కదా తింటాము! కాని నీళ్లు-  నీళ్లు ప్రతిరోజూ అనేకసార్లు త్రాగుతాము. నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కుంటాం, ముఖం శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది‌. "అని చెప్తుంది.

   
మర్నాడు అత్త పెందలకడనే లేచి
నుయ్యి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడి తొట్టిలో వేయసాగింది. కోడళ్లందరూ
హడావిడిగాఅక్కడకుచేరుకున్నారు.

   "అత్తగారూ! మీరు చేసేదేమన్నా బాగున్నదా? మేమింతమంది వుండగా మీరు ఈ నూతి దగ్గరకు రావడమేమిటి? "

   "మీరేమీ ప్రశ్నించకండి! నేను పెద్దదాన్నయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించు
కోవాలి. మీరైతే వెనుకనైనా చేసుకోవచ్చు."

   
మరునాటి నుండి కోడళ్లు కూడా నూతి దగ్గరకు చేరి వంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏంచెయ్యాలో తోచలేదు.  "అమ్మా! నాకు సెలవిప్పించండి."
అని వెనుతిరగ్గా చిన్న కోడలు అడ్డుకొని అత్తగారితో " ఇతడిని ఉద్యోగం మానిపించవద్దు. షాపులో వేరే పని అప్పగిద్దాం!" అన్నది.
"చిన్నకోడలి మంచితనం"తెల్సుకుని అత్త చాలా సంతోషించింది.

   చిన్న కోడలు ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడింది. "ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు.
పిండి విసురుతున్నారు. నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చేయాలి? "ఒకనిర్ణయానికి వచ్చింది.

   
తరువాతిరోజు ఉదయాన్నే వంట
గది చేరుకుని అంట్లు ముందేసుకుని
బూడిద చేతిలోకి తీసుకుని మూల కూర్చున్నది. పనిమనిషి విస్తుపోయి అలాగే నిలబడిపోయింది‌. గబగబా అత్తగారు వచ్చింది.

    "ఏమే! నా ముద్దుల కోడలా! ఇది మాత్రం నీకు తగదు.మనకుపనిచేసే
వాళ్లున్నారు.అంట్లు తోమడం వల్ల
 నీ బట్టలు ఖరాబవుతాయి. నీ నగలు అరిగిపోతాయి." అని
సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు " అత్తయ్యా! నన్ను
కాస్సేపు మాట్లాడనివ్వండి. ఎంగిళ్లెత్తడంలో గొప్ప
మాహాత్మ్యము వున్నది. మీరు మహాభారతం లో కథ వినలేదో! పాండవులు రాజసూయాగం చేస్తూ శ్రీకృష్ణుణ్ని ప్రధమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా! ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరియెంగిలి
విస్తళ్లు ఎత్తేపని చేసాడు తెలుసా!  ఎంగిళ్లెత్తటమనేది ఎంత మహిమా
న్వితం కాకపోతే భగవంతుడీ పనెందుకు చేస్తాడు?"

 
తర్వాత రోజు అత్తవచ్చి వంటింట్లో
తిష్ట వేసి అంట్లు ముందేసుకుంది. ఈ వింత చూసి కోడళ్లందరూ చుట్టు
ముట్టారు. వెంటనే చిన్న కోడలు
" అత్తయ్యా! ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో! ఈ పళ్లెం, చిన్న గ్లాసుపై నాకే
హక్కు వున్నది. ఎందుచేతనంటే -
ఇవి నా పతిదేవుడివి. కనుక వీటిని
నేను తోముతాను." అంది. దానికి
అత్తగారు " వెళ్లు వెళ్లు! వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు.కాబట్టి వీటిని నేనే తోముతాను." ఈ విధంగా అని గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి కోడళ్లందరూ కూర్చుని వాళ్లూ అంట్లు కడగడం ప్రారంభించారు.

 
" ఇప్పుడు నేనేంచెయ్యను? అని చిన్న కోడలు ఆలోచనలో పడింది. రోజూ ఉదయం ఇల్లు తుడవడానికి
నౌకరు వస్తూంటాడు కదా!అనుకుని
వేకువకాగానే లేచి చీపురు పట్టింది. నౌకరు వచ్చేముందుగానే
గదులన్నీ ఊడ్చిపారేసింది. అత్త
గారిది చూసి " చిన్న కోడలా! ఇల్లు
నువ్వు తుడిచావేమిటి? అని అడగ్గా కోడలు-

    " అత్తయ్యా! మీరు కాస్సేపు ఊరుకోండి. మారు మాట్లాడకండి. మీరు మాట్లాడారంటే నా చేతిలో
పనిపోతుంది అని ఇంకా ఇలా అన్నది.
  "మీరు రామాయణం వినలేదా! అడివిలో గొప్ప గొప్ప ఋషులు,
మునులు వుండగా శ్రీరాముడు వారి కుటీరాలకు వెళ్లకుండా ముందుగా శబరి కుటీరానికే వెళ్లాడు. ఎందుకో తెలుసాండీ ?శబరి రోజూ పంపాసరో
వరానికివెళ్లే దారిలో రాళ్లూరప్పలని తొలగించి ఋషులకు దారిఏర్పాటు
చేసి వారికి సేవలు చేసేది. ఈ సేవలో గొప్ప మహిమ వున్నది. "

    
మర్నాటినుండి కోడళ్లందరూ చీపుర్లు పట్టారు. ఈ విధంగా ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి
పనుల్లో వారు మునిగిపోతున్నారు.
శుభ్రంగా గదులు తుడుస్తున్నారు. నీళ్లు తోడుతున్నారు. అంట్లు
శుభ్రపరుస్తున్నారు.వంటలు వండు కుంటున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతున్నాయి. కోడళ్లందరూ అన్యోన్యంగా ఉంటున్నారు.
అత్తామామలను గౌరవంగా చూసు
కుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. యజమాని వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్లందరికీ
నగలు చేయించారు.

   ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారిచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు వుంటున్న గదిలోనికి వెళుతూండగా అత్త  చూసింది.

   చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటున్నది.

   " అక్కా! మీకు ఆడపిల్లలు వున్నారు. వారు పెరుగుతున్నారు. రేపో,మాపో వారికి పెళ్లిళ్లు చేయాలి.
నాకైతే ఇంకా పిల్లలు లేరు.అందు
వల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మానాన్న నాకు నగలు బాగానే పెట్టారు. అవన్నీ నాదగ్గర ఇనప్పెట్టెలో పడి వున్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో! పిల్లల పెళ్లిళ్లకి అక్కరకొస్తాయి." అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట
నుండి ఇదంతా గమనిస్తున్న  అత్త
ఒక్కసారిగా చలించి పోయింది.



కొసమెరుపు: ఉపన్యాసాలు చెప్పడం వేరు. ఆచరణలో చూపడం వేరు.ఈకొత్త కోడలు తాను చెప్పినది
ఆచరణ చేసి చూపించింది. ఇంటిని సంస్కరణ బాటలోకి నడిపించింది.👍

(వివేక చూడామణి.) స్వామీజీ వ్రాసిన పుస్తకం నుండి
సేకరణ

Friday, 9 October 2020

తెలుగు నెలలు Telugu Months Names

 తెలుగు నెలలు

  • చైత్రము
  • వైశాఖము
  • జ్యేష్ఠము
  • ఆషాఢము
  • శ్రావణము
  • భాద్రపదము
  • అశ్వయుజము
  • కార్తీకము
  • మార్గశిరము
  • పుష్యము
  • మాఘము
  • ఫాల్గుణము


Seasons in Telugu Rutuvulu in Telugu | తెలుగులో ఋతువులు

 తెలుగులో ఋతువులు

  • వసంత ఋతువు    : SPRING SEASON
  • గ్రీష్మ ఋతువు        : SUMMER SEASON
  • వర్ష ఋతువు            : RAINY SEASON
  • శరదృతువు              : BEGINING OF WINTER
  • హేమంత ఋతువు : WINTER
  • శిశిర ఋతువు          : AUTUMN

 

Time Scale in Telugu - తెలుగులో కాలమానము

 తెలుగులో కాలమానము.

  • క్షణకాలము - Second
  • నిమిషము - Minute
  • గంట - Hour
  • వేకువజాము - Early Morning
  • ఉదయము - Morning
  • మధ్యాహ్నము - Afternoon
  • సాయంకాలము - Evening
  • రాత్రి - Night
  • అర్థరాత్రి - Mid Night
  • పగలు - Day time
  • దినము - Day
  • వారము - Week
  • పక్షము - Fortnight
  • నెల - Month
  • అయనము - Six Month-Period
  • సంవత్సరము - Year
  • పుష్కరము - 12 Year-Period


Dikkulu Directions in Telugu - 8 దిక్కులు తెలుగులో

 
దిక్కులు తెలుగులో
మనం చిన్నప్పుడు స్కూల్లో East, West, North & South అని నాలుగు దిక్కులు నేర్చుకున్నాం, కానీ మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం వాస్తు ప్రకారం మొత్తం దిక్కులు ఎనిమిది. అందుకే అష్టదిక్పాలకులు అని అంటాం.
ఇవి గుర్తు పెట్టుకోవడం చాలా సులువు.

  • తూర్పు - East

  • పడమర - West

  • ఉత్తరం - North

  • దక్షిణం - South

  • ఆగ్నేయం - South East

  • నైరుతి - SouthWest

  • వాయువ్యం - NorthWest

  • ఈశాన్యం - NorthEast