Thursday, 8 October 2020

DVS Karna Dailogues in Telugu | దానవీరశూర కర్ణ దుర్యోధనుడి డైలాగ్స్ తెలుగులో

 "దానవీరశూర కర్ణ" దుర్యోధనుడి డైలాగ్స్ తెలుగులో

 “అస్త్ర విద్యా పరీక్ష”:-

 దుర్యో:- ఆగాగు! ఆచార్యదేవా! హహ్హ ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?
మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము? ఇంతయేల, అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనిoచలేదా ! ఈయన దే కులము ?
నాతో చెప్పింతువేమయ్యా , మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి ఛండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో- ధర్మనిర్మాణచణుడని మీచే కీర్తింపబడుచున్న- హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము- ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదమెందులకు?


భీష్మ:- నాయనా సుయోధనా! ఏరుల, పారుల, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవికావు. ఇది, నీవన్నట్లుగా, ముమ్మాటికీ క్షాత్ర పరీక్షయే! క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే! వారిలో రాజ్యమున్న వారే రాజులు! అట్టి యీ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు!


దుర్యో:- ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది. అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు,  అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.
సోదరా.. దుశ్శాసనా ! అనర్ఘనవరత్న ఖచిత కిరీటమును వేగముగ తెమ్ము; మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము;  పరిచారకులారా ! పుణ్య భాగీరథీనదీ తోయములనందుకొనుడు; కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,
వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు; పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది, బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ద సహజకవచఖచితవైఢూర్య ప్రభాదిత్యోలికి వాంఛలురేగ వీరగంధము విదరాల్పుడు. నేడీ సకలమహాజనసమక్షమున, పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా, శతథా సహస్రథా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను .

Startup Business plans తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే కొన్ని ట్రేడింగ్ బిజినెస్‌‌లు

 తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే కొన్ని ట్రేడింగ్ బిజినెస్‌‌లు 


 

బిజినెస్ చేయాలని ఆలోచిస్తుర్నారా? అయితే ఏ వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా? ఏం పర్వాలేదు. ఏ బిజినెస్‌ను అయినా చిన్నగానే ప్రారంభించాలి. తర్వాత చిన్న వ్యాపారాన్ని క్రమంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలి. ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలను మనకు ఆదర్శంగా తీసుకోవాలి.


చిన్న వ్యాపారాలను ఇంట్లో నుంచే నిర్వహించుకోవచ్చు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అవసరమౌతుంది. ఒక్కొక్కసారి రూ.10,000లతో కూడా ప్రారంభించొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే కొన్ని ట్రేడింగ్ బిజినెస్‌‌లు (ట్రేడింగ్ బిజినెస్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ లేదా హోల్‌సెల్లర్ల నుంచి ప్రొడక్టులను కొని వాటిని కస్టమర్లకు లేదా రిటైలర్లకు డైరెక్ట్‌గానే విక్రయించడం) ఏంటివో చూద్దాం..

1. Mobile Accessories: స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. దీంతో మొబైల్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. వీటికే కాదండోయ్.. మొబైల్ యాక్ససిరీస్‌కు కూడా అంతే డిమాండ్ ఉంది. హెడ్‌ఫోన్స్, పవర్ బ్యాంక్స్, పెన్‌డ్రైవ్స్, మొబైల్ కవర్స్ వంటి వాటికి యూత్‌లో ఫుల్ డిమాండ్. వీటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చు. 

2. Food Business: జీవితం బిజీబిజీ అయిపోయింది. అన్నం తినడానికి కూడా తీరిక లేకుండా పోతోంది. ఐటీ, కాల్ సెంటర్ ఉద్యోగులు టిఫిన్ సర్వీసులతో రిలీఫ్ పొందుతున్నారు. మీరు రుచిగా వండేవారు అయితే ఈ బిజినెస్ కూడా ట్రై చేయవచ్చు.

3. Online Bakery : మీకు కేక్ తయారు చేయడం వచ్చా? అయితే ఇంకేం మీకు డబ్బులు సంపాదించే అవకాశం అందుబాటులో ఉన్నట్లే. ఆన్‌లైన్ బేకరీ బిజినెస్‌ను ప్రారంభించేయండి. ఇప్పుడు ప్రతిఒక్కరూ రెడీమేడ్, డోర్ డెలివరీ కోరుకుంటున్నారు. చాలా మంది ఆన్‌లైన్‌లోనే కేకులు ఆర్డర్ ఇస్తున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టా్గ్రామ్ పేజ్‌ క్రియేట్ చేసి దాన్ని పాపులర్ చేసుకోండి.
 

4. Lether Bags : క్లాస్ లుక్ ఫ్యాషన్ ట్రెండ్ పెరుగుతోంది. అందుకే లెదర్ బ్యాగ్స్‌కు డిమాండ్ ఉంది. దైనందిన కార్యకలాపాలకు చాలా మంది లెదర్ బ్యాగ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాపారం కూడా లాభసాటిగానే ఉంటుంది.
 

5. Green Tea : ఇటీవల ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యకరమైన ఆనందమైన జీవనం కొనసాగించాలని చాలా మంది భావిస్తున్నారు. అందుకే గ్రీన్ టీకి ప్రాధాన్యం పెరిగింది. బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీనే ఫేమస్. గ్రీన్ టీతో చాలా ప్రయోజనాలున్నాయి. ఈ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే.
 

6. Costumes Jewelry : యువత ప్రస్తుతం ఫ్యాషన్, స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇక్కడ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఫ్యాషన్, స్టైల్‌ వంటి వాటిల్లో వాళ్లు ఎప్పుడు ముందే ఉంటారు. కస్ట్యూమ్ జువెలరీ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరేమో. వీటి వల్ల అమ్మాయిల అందం మరింత పెరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో దేశంలో కాస్ట్యూమ్ జువెలరీ మార్కెట్‌లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. చాలా మంది ఎంట్రప్రెన్యూర్లు.. హోల్‌సెల్లర్ల నుంచి జువెలరీని కొనుగోలు చేసి, దాన్ని కస్టమర్లకు డైరెక్ట్‌గా విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టా్గ్రామ్ కూడా ఉపయోగిస్తు్న్నారు.
 

ఇవేకాకుండా సోలార్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, కంప్యూటర్ యాక్ససిరీస్, క్యాండిల్స్ వంటి వ్యాపారాలు కూడా చేయవచ్చు. ఇవి కూడా లాభసాటిగానే ఉంటాయి. 

Nava Graha Shlokalu నవగ్రహ ధ్యాన శ్లోకములు

 జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు.

నవగ్రహాలు


 

సూర్యుడు
చంద్రుడు
అంగారకుడు (మంగళగ్రహం)
బుధుడు
గురువు
శుక్రుడు
శని
రాహువు
కేతువు

 నవగ్రహ ధ్యాన శ్లోకములు
నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః


రవి
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం

చంద్ర
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

కుజ
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం

బుధ
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం

గురు
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం

శుక్ర
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం

శని
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం

రాహు
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్

కేతు
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్

Thursday, 24 September 2020

Android mobile Secret codes For users

Here I am giving Secret codes for Android mobiles. 

 1. T know the IMEI number dial 

*#06# 

2.To know Mobile Battery, Usage Information dial

 *#*#4636#*#* 

 3. To Activate / Deactivate Call waiting option 

Call Waiting Enable *43# 

Call Waiting Disable #43# 

4.To make Call diversion disable dial ##002# 

5. To know Camera information dial *#*#34971539#*#* 

6. To know RAM information *#*#3264#*#* 

 

Note: Based on Mobile company & Type, May be some codes are not working for some mobiles


Wednesday, 16 September 2020

Chanakya neethi About Marriage Success

 చాణక్యనీతి : ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిలను వివాహం చేసుకోవాలి

భారతదేశ ఒక గొప్ప ఆర్ధికవేత్త, తత్వవేత్త అయిన చాణుక్యుడు అప్పట్లోనే మనం సంతోషంగా జీవించడానికి ఎన్నో నీతులు చెప్పాడు. అందులో వివాహానికి సంబంధించిన కొన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను.

వివాహవ్యవస్థ ప్రకారం పురుషులు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళి తర్వాత మాత్రం భార్యాపిల్లలతో ఎన్నో భాద్యతలను మోయాలి. ఎన్నోసమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొని జీవితంలో ముందుకెల్లాలంటే చాలాముఖ్యమైనది తనని అర్ధంచేసుకొనే మంచి భార్య తన జీవితంలోకి రావాలి.
 అందుకే చాలామంది అంటారు,"ప్రతిమగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంది" అని. అదేవిధంగా మీరు మీభవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే, మీకు మీ భాగస్వామియొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. అందుకే మానసికశాస్త్రాన్ని అద్యయనం చేసిన చాణక్యుడు ఏడు లక్షణాలున్న స్త్రీలగురించి చెప్పాడు.

Tuesday, 15 September 2020

Pradhan Mantri Kanya Ashirwad Yojana 2020 Scheme Real or Fake ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము

ఈమద్య ఫేస్ బుక్, వాట్సాప్ లో ఒక వార్త తెగ షేర్ అవుతుంది.అదేంటంటే  

ఆడపిల్లలకు శుభవార్త    

ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము                           

ఆడపిల్లలకు అద్భుత మైన పథకం

 ఒక సంవత్సరం కు కేంద్ర ప్రభుత్వం Rs.24,000/-  ఇస్తుంది.

       అర్హతలు

1.   ఆడ పిల్లలు వయస్సు 5 సంవత్సరం ల నుండి 18 సంవత్సరo లోపల కలిగి ఉండాలి.

2. అమ్మాయి పుట్టిన తేది
నమోదు చేయాలి.

3.   తండ్రి  ఆదాయము సంవత్సరం కు 2,00,000/- దాటకూడదు

4.   తండ్రి ఆధార్ కార్డు, మరియు ఆడపిల్ల ఆధార్ కార్డు  నెంబర్ లు నమోదు చేయాలి.

5.  అమ్మాయి చదువు కుంటుంటే -ఏ స్కూల్ లో, లేక కాలేజ్ వివరములు నమోదుచేయాలి.

6.  తెల్లరేషన్ కార్డ్ నెంబర్ కూడా నమోదు చేయాలి.

7. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదు చెయ్యాలి.

 24,000/- నేరుగా మీ బ్యాంక్ ఖాత లో జమ అవుతాయి.

 ఈ వివరములు అన్నీ కూడా  "కామన్ సర్వీసు సెంటర్" నందు నమోదు చేసుకోవాలి.
ఆడపిల్లలు అందరూ  కూడా ఈ అవకాశమును తప్పకుండా సద్వినియోగము చేసుకోగలరరు.

 చాలామంది ఇది నిజమా కాదా తెలియకుండానే అందరికీ షేర్ చేస్తున్నారు.

అసలు నిజానికి ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ఎలాంటి ప్రభుత్వ పతకం లేదు. ఆ పథకం గురించి కేంద్రం ఎప్పుడూ ఎక్కడా పేర్కొనలేదు.
సో అందరూ తొందరపడి ప్రతి విషయాన్ని నమ్మకండి, మీకు నిజం తెలియనపుడు అటువంటి వార్తలను షేర్ చేసి ఇబ్బందులు తెచ్చుకోకండి